Monday, May 6, 2024

మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం మన దురదృష్టం

spot_img

మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు  సీఎం కావడం మన దురదృష్టమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రజల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారన్నారు. ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. సీఎం మిషన్‌ భగీరథపై మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.

ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వంద శాతం ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం సాధ్యమైంది. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి, ఈ మిషన్ భగీరథ దండుగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత దారుణమన్నారు. మిషన్ భగీరథ కోసం మా ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ.50 వేల కోట్లకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఏం లాభం తెచ్చారని, దానికి తెచ్చిన అప్పుకు వడ్డీ ఎలా కడుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన, భావ దారిద్ర్యమైన ఆరోపణ ఇంకోటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మిషన్ భగీరథ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏమిటి? అనే విషయాలపై కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాల సంఖ్య కేవలం 5,672 అయితే, 2023 పూర్తయ్యే నాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయి.

2014కు ముందు కేవలం 30 శాతం ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యం ఉండేది. అది ప్పుడు వంద శాతానికి చేరుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా తెలిపిందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి తప్పా.. అందులో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ఒక ప్రభుత్వాధినేతకు తగదని హితవు పలికారు హరీశ్ రావు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని లెక్కలు, ఆధారాలతో సహా చెప్పినా వీరికి అవగాహన కలుగడం లేదన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వడాన్ని, ప్రజలకు మంచినీరు ఇవ్వడాన్ని కూడా లాభనష్టాలతో బేరేజు వేసుకునే ప్రభుత్వం ఒకటి వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరన్నారు. ఆసరా పెన్షన్ల ద్వారా కూడా వేల కోట్లు ఖర్చు అవుతుంది. దాని వల్ల లాభం లేదంటారా? అని ప్రశ్నించారు హరీశ్ రావు.ముందుగా ఇచ్చిన ఆ హామీల గురించి మాట్లాడాలని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటైంది

Latest News

More Articles