Monday, May 20, 2024

జేఈఈ చదువలేను.. కోటాలో విద్యార్థిని ఆత్మహత్య

spot_img

హైదరాబాద్: చదువల ఒత్తిడి తట్టుకోలేక రాజస్థాన్‌ కోటాలో మరో విద్యార్థిని సూసైడ్ చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కోటాలోని శిక్షానగరి ఏరియాలో నిహారిక(18) అనే విద్యార్థిని జేఈఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన నిహారిక, తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తల్లిదండ్రులకు రాసిన సూసైడ్‌ నోట్‌ లో ‘అమ్మా, నాన్న.. నేను జేఈఈ చేయలేను. నన్ను క్షమించండి’ అంటూ రాసింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కోటా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కోచింగ్‌ హబ్‌ అయిన కోటాలో ఈనెల 23వ తేదీ నీట్‌ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ అనే విద్యార్థి నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. చదువు ఒత్తిడి తట్టుకోలేక తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2023లో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

Also Read.. మహనీయుల చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ అడ్డుపడుతుంది

Latest News

More Articles