Friday, May 17, 2024

విపక్షాల భేటీ: కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ‘ఆప్’ అసంతృప్తి..!

spot_img

హైదరాబాద్: విపక్షాల భేటీలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆమాద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన బ్లాక్ ఆర్డినెన్స్ బహిరంగంగా వ్యతిరేకించి, రాజ్యసభలో తన 31 మంది రాజ్యసభ ఎంపీలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తారని ప్రకటించాలని ఆప్ డిమాండ్ చేసింది. అలా జరగని సందర్భంలో రానున్న రోజుల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనడం తమకు కష్టమని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.

కాంగ్రెస్ మినహా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మిగతా 11 విపక్ష పార్టీలు బ్లాక్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాయని ఆప్ తెలిపింది. ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీ ప్రజల పక్షాన నిలబడుతుందా లేక మోడీ ప్రభుత్వంతో నిలబడుతుందా అనేది తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైందని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది.

Latest News

More Articles