Friday, May 3, 2024

‘జైలర్‌’ విలన్ వినాయకన్‌ అరెస్టు

spot_img

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’ చిత్రంలో ఆయనకు ఎంత పేరు వచ్చిందో.. అంతే పేరు విలన్‌గా నటించిన వినాయకన్‌‎కు కూడా వచ్చింది. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా ఆయనను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఆయన పోలీసులను దుర్భాషలాడటంతో ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. తమను వినాయకన్‌ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాంతో ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఆ సమయంలో మద్యం మత్తుతో ఉన్న వినాయకన్‌.. సహనం కోల్పోయి పోలీసులతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అతడిని వారించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి కాదని, ఓ మోడల్‌ను వేధించిన కారణంగా గతంలోనూ అతడిని అరెస్ట్‌ చేయగా.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.

Latest News

More Articles