Friday, May 17, 2024

2018 తెలంగాణ ఎన్నికల్లో తూటాలా పేలిన నోటా.. ఐదుగురి తలరాత తలకిందులు

spot_img

ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నోటా పేరుతో ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే పోటీలో ఉన్నవాళ్ళెవరూ నచ్చకపోతే నోటాకు వేసే అవకాశం కల్పించారు. ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటా అమలులోకి వచ్చింది.

Read Also: ‘జైలర్‌’ విలన్ వినాయకన్‌ అరెస్టు

ఈ నోటా వల్ల 2018 ఎన్నికల్లో తెలంగాణలోని ఆరుగురి భవితవ్యం మారపోయింది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు 65,788 ఓట్లు సాధించి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కోవా లక్ష్మి(బీఆర్ఎస్)కి 65,617 ఓట్లు వచ్చాయి. అంటే సక్కు 171 ఓట్ల తేడాతోనే గెలుపొందారు. అంటే ఇక్కడ నోటాకు పడిన ఓట్లు ఏకంగా 2,711 కావడంతో కోవా లక్ష్మి ఓడిపోయారు.
ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 70,579 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (కాంగ్రెస్‌) 70,138 ఓట్లు సాధించారు. ఈ లెక్కన ఈశ్వర్‌ 441 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ అయిదో స్థానంలో నిలిచిన నోటాకు పడిన ఓట్లు 2,597 కావడం గమనార్హం.
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి లభించిన ఆధిక్యం 376 ఓట్లు. ఆయనకు 72,581 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి(బీఎస్పీ)కి 72,205 ఓట్లు, నోటాకు 1,145 ఓట్లు వచ్చాయి.
అంబర్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ 61,558 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. సమీప ప్రత్యర్థి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. వెంకటేశ్‌కు లభించిన ఆధిక్యం 1,016 ఓట్లు. నాలుగో స్థానంలో నిలిచిన నోటాకు 1,462 ఓట్లు వచ్చాయి.
కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌కు 89,115 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి నలమాడ పద్మావతిరెడ్డికి 88,359 ఓట్లు పడ్డాయి. 756 ఓట్ల తేడాతో మల్లయ్య యాదవ్‌ గెలుపొందారు. ఇక్కడ నోటాకు లభించిన ఓట్లు 1,240.
వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు 52,650 ఓట్లు సాధించి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌కు 50,637 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ రాములు ఆధిక్యం 2013 కాగా.. నోటాకు లభించినవి 2,360. వీరందరూ నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు.

Read Also: సీటు రానందుకు ఖుషి అయితున్న తెలంగాణ బీజేపీ నేతలు

అంతేకాకుండా.. తెలంగాణలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో నోటా… ఏఒక్కచోటా చివరి స్థానంలో నిలవలేదు. ఏకంగా 70 నియోజకవర్గాల్లో అయిదులోపు స్థానాలనే దక్కించుకుంది. అప్పుడు మొత్తం ఓట్ల సంఖ్య 2,56,94,443. పోలైన ఓట్లు 2,04,70,749 (79.7%). నోటాకు ఏకంగా 2,24,709(1.1%) ఓట్లు లభించడం గమనార్హం. గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకంటే వర్ధన్నపేటలో అత్యధికంగా 5,842 ఓట్లు నోటాకు లభించాయి.

Latest News

More Articles