Sunday, May 19, 2024

రామమందిరం వద్ద డాన్స్ అదరగొట్టిన కంగనా.. వీడియో వైరల్..!

spot_img

అయోధ్యలోని చారిత్రాత్మక రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుక క్షణాన్నికళ్లారా చూసినందుకు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉందన్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అయోధ్య రామ మందిరంలోని రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది కంగనా. ఆ వీడియోలో కంగనా డ్యాన్స్ చేస్తూ జై శ్రీ రామ్ అని నినాదాలు చేసింది. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత కంగనా ఆనందంతో డ్యాన్స్ చేస్తూ పరవశించిపోతూన్న వీడియో పెట్టి దానికి “రామ్ ఆ గయే” అని క్యాప్షన్ ఇచ్చింది.

కంగనా రనౌత్ షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో బాలీవుడ్ దిగ్గజ హీరోలని వణికించే కంగనా పక్క హిందుత్వవాదిగా గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఆమెని మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినప్పుడు బీజేపీ ఆమెకి అండగా నిలిచింది. ఇక బాలీవుడ్ సెలెబ్రిటీలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు. కంగనా రనౌత్ ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అయితే కంగనా రనౌత్ కొన్ని నెలల క్రితం తిరుమల శ్రీవారిని అలాగే శ్రీకాళహస్తిని సందర్శించింది.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

Latest News

More Articles