Tuesday, May 21, 2024

గాజా నుంచి విదేశీయుల తరలింపు.. ఈజిప్టు, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య కీలక ఒప్పందం

spot_img

గాజా: హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు వలసబాట పట్టారు. ఈ క్రమంలో గాజాలోని విదేశీ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read.. దసరా ధమాకా: మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్

అయితే, తాజాగా గాజా నుంచి విదేశీయులను సురక్షితంగా బయటకు తరలించేందుకు ఈజిప్టు, ఇజ్రాయెల్‌, అమెరికాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీనిద్వారా గాజాలోని రఫా సరిహద్దు గుండా విదేశీయులను తమ దేశంలోకి అనుమతించేందుకు ఈజిప్టు అంగీకరించింది. ఈ విషయంలో హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ల నుంచి కూడా ఆమోదం లభించినట్లు ఈజిప్టు అధికారులు చెప్పారు.

Also Read.. ఆప్‌ ఎంపీ సంజ‌య్ సింగ్‌ కు ఢిల్లీ కోర్టు వార్నింగ్

మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా పాలస్తీనాలో ఇప్పటికే 4.23 లక్షల మంది నిరాశ్రయులైనట్లు యూఎన్ఓ తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 2,215 మంది పాలస్తీనీయులు మరణించినట్లు హమాస్‌ నియంత్రణలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Latest News

More Articles