Sunday, May 19, 2024

రేపటి నుంచి భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు

spot_img

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ఈ నెల 15 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. తొలిరోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్మనమివ్వనున్నారు. 16న సంతానలక్ష్మి, 17న గజలక్ష్మి, 18న ధనలక్ష్మి, 19న ధాన్యలక్ష్మి, 20న విజయలక్ష్మి, 21న ఐశ్వర్యలక్ష్మి, 22న వీరలక్ష్మి, 23న మహాలక్ష్మి, 24 (విజయదశమి)న నిజరూపలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదే రోజున ఆలయ అర్చకులు సంక్షేప రామాయణ హవన పూర్ణాహుతి, మహా పట్టాభిషేకం, విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామ లీలా మహోత్సవం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు శ్రీమద్రామాయణ పారాయణం పఠించనున్నారు. దశమి రోజున పట్టాభిషేకం, సంక్షేప రామాయణ హవనం చేయించుకునేందుకు ఆలయ అధికారులు భక్తులకు అవకాశం ఇచ్చారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ 3:30 నుంచి 4:30 గంటల వరకు జరిగే కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొనవచ్చు.

ఇది కూడా చదవండి: రూ. 50 వేలు మించి న‌గ‌దు ఉంటే సీజ్ చేస్తాం

Latest News

More Articles