Friday, May 3, 2024

అహల్యానగర్‌ గా అహ్మద్ నగర్: పేరు మారుస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం

spot_img

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ( బుధ‌వారం) నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను వ్య‌వ‌హ‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది.

అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరు మార్చాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే గ‌త ఏడాది మేలో తొలిసారిగా ప్ర‌తిపాదించారు. నిజాంషాహి వంశానికి చెందిన అహ్మ‌ద్ నిజాంషా పేరుతో 15వ శ‌తాబ్ధంలో ఈ న‌గ‌రానికి అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరు పెట్టారు.

2022లో ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్ పేర్ల‌ను శంభాజీన‌గ‌ర్‌, ధారాశివ్‌గా మార్చారు. ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ల‌కు మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు ఔరంగ‌జేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ల పేర్లు పెట్టారు.

అంతేకాదు..  బ్రిటీష్ కాలం నాటి పేర్లుగా ఉన్న 8 ముంబై రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్తాన్ (భయందర్), విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర మార్గాన్ని నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ డెవిన్ గ్రాండ్ ఎంట్రీ

Latest News

More Articles