Wednesday, June 26, 2024

మళ్లీ అలాంటి యాడ్స్ లో నటించలేదు

spot_img

తాను మళ్లీ పాన్ మసాలా యాడ్స్ లో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ఇలాంటి యాడ్స్ లో తాను నటించనని ప్రకటించిన తర్వాత వాటి జోలికి పోలేదని స్పష్టం చేశారు. అక్షయ్ కుమార్ గతంలో నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో ఆయన మళ్లీ ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లుగా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ప్రకటన 2021 అక్టోబర్ నెలలో షూట్ చేసిందని.. అగ్రిమెంట్ ప్రకారం దీన్ని 2023 నవంబర్ వరకు ప్రసారం చేయవచ్చునని చెప్పారు అక్షయ్ కుమార్. అంతే తప్ప తాను మళ్లీ పాన్ మసాలా యాడ్‌లో నటించలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిలో నటించనని తాను బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత మళ్లీ అలాంటి యాడ్స్ లో పాల్గొనలేదన్నారు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. నిర్దేశిత వ్యవధి వరకు ఆ ప్రకటనను ప్రసారం చేసుకోవచ్చన్నారు అక్షయ్ కుమార్.

ఇది కూడా చదవండి:ఎక్స్ లో మరో కీలక మార్పు

Latest News

More Articles