Monday, May 20, 2024

పొన్నాలపై అనుచిత వ్యాఖ్యలు: రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం

spot_img

పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల మున్నూరు కాపులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మున్నూరుకాపు స‌మాజానికి రేవంత్ రెడ్డి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు.

ఖమ్మం మయూరి సెంటర్ లో జిల్లా మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి తక్షణమే.. పొన్నాల లక్ష్మయ్యకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపుల సత్తా చూపెడతామని హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ రేవంత్ రెడ్డి ఫొటో ఫ్లెక్సీ దగ్ధం చేశారు వేములవాడ మున్నూరు కాపు కులస్తులు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.. మున్నూరు కాపు ముద్దుబిడ్డ పై చేసిన వ్యాఖ్యలను  వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క‌రీంన‌ర్ మున్నూరు కాపు జిల్లా ప్ర‌ధాన కార్యదర్శి నలువాల రవీందర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ చౌక్‌లో రేవంత్ రెడ్డి దిస్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేశారు. పొన్నాల‌కు, మున్నూరుకాపు స‌మాజానికి రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్స్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: మేడ్చల్ లో భారీగా నగదు పట్టివేత

Latest News

More Articles