Wednesday, May 8, 2024

సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 50 ఏండ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం

spot_img

న్యూఢిల్లీ: 28 ఏళ్ల కిందట తపాలా శాఖ లో ఉద్యోగం పొందిన వ్యక్తి.. ఉద్యోగంలో చేరేందుకు మాత్రం దాదాపు మూడు దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు 50 ఏండ్ల వయసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఉద్యోగం దక్కింది.

Also Read.. బతుకమ్మ పండుగ నాడే విషాదం.. ముగ్గురు కార్మికులు మృతి

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ లోని లఖింపుర్‌ ఖేరీ పోస్టల్‌ డివిజన్‌లో 1995లో 10 పోస్టల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించారు. దీనికి అంకుర్‌ గుప్తాతోపాటు పలువురు ఎంపికయ్యారు.  15 రోజుల ప్రీ-ఇండక్షన్ ట్రైనింగ్‌కు పంపించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వొకేషనల్‌ స్ట్రీమ్‌లో ఇంటర్‌ పూర్తిచేసిన అంకుర్‌ సహా కొంతమందిని అనర్హులుగా ప్రకటించి ఉద్యోగంలోకి తీసుకోలేదు.

Also Read.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

దీంతో బాధితులు 1996లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యూనల్‌ (CAT)ను ఆశ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ తపాలా శాఖ 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించింది. 17 ఏళ్ల తర్వాత హైకోర్టు కేసును కొట్టేసి ట్రైబ్యూనల్‌ ఆదేశాలను సమర్థించింది. దీంతో తపాలా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. తపాలా శాఖ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read.. అసెంబ్లీ ఎన్నికలు.. తనిఖీల్లో రూ.74 కోట్లు సీజ్

ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ సమయంలో వొకేషనల్‌ స్ట్రీమ్‌లో చదివినవారు అనర్హులని పోస్టల్ శాఖ స్పష్టంగా చెప్పలేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.  పిటిషనర్లలో చాలా మంది తమ పోరాటాన్ని మధ్యలోనే ఆపేయగా.. ఒక్క అంకుర్‌ మాత్రమే చివరి వరకు పోరాడారు. ఈ ఉద్యోగానికి పదవీ విరమణ వయసు 60 ఏళ్లు కాగా.. ప్రస్తుతం ఆయన 50 ఏళ్లు దాటారు.

Latest News

More Articles