Monday, May 20, 2024

పట్నం బాటపట్టిన పల్లెవాసులు.. టోల్ ప్లాజాలన్నీ వాహనాలతో రద్దీ

spot_img

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ లో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరుగుపయనం అవుతున్నారు. పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొద్ది గంటల్లో భాగ్యనగరం కళకళలాడబోతోంది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లిన వారంతా తిరిగి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు.

ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం నుండి వేల వాహనాల్లో ప్రజలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‎లను అధికారులు ఓపెన్ చేశారు. అదేవిధంగా కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద 8 బూత్‎లు ఓపెన్ చేశారు. ఫాస్టాగ్ సిస్టం ద్వారా సెకన్ల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ దాటుతున్నాయి.

Read Also: ఢిల్లీ హైకోర్టులో ఎంఎస్ ధోనీపై పరువు నష్టం దావా

సూర్యాపేట, ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 బూత్‎లకుగానూ 6 బూత్‎లను హైదరాబాద్ వైపు తెరిచారు. జనగామ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట్, విజయవాడ, కర్నూల్, ఘట్ కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అండర్ పాస్‎లు లేని చోట, క్రాసింగ్‎ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Latest News

More Articles