Saturday, May 18, 2024

18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

spot_img

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ తన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. గత కొంతకాలంగా చాలా మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ తాజాగా మరో 18 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. కరోనా సమయంలో అమెజాన్  సంస్థ భారీగా ఉద్యోగులను నియమించుకుంది. దీంతో ఆ సంస్థకు నిర్వహణ ఖర్చు అధికమైంది. దీంతో ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను క్రమంగా తొలగిస్తోంది. నవంబర్ లో తొలగిస్తామని ప్రకటించిన దాని కంటే కూడా 18 వేల మందిని ఎక్కువగా జాబ్ నుంచి తీసేస్తామని కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ సంస్థలో 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Latest News

More Articles