Saturday, May 18, 2024

కాల్ గర్ల్ కోసం ఆన్‌లైన్‌లో వెతికిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగి.. కట్ చేస్తే..

spot_img

వేశ్య కోసం వెంపర్లాడిన ఓ యువకుడు లక్షలు పోగొట్టుకున్నాడు. అమ్మాయి కోసం ఆన్‌లైన్‌లో వెతికిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సైబర్‌ నేరగాడి చేతిలో పడి రూ.1.97 లక్షలు పోగొట్టుకున్నాడు. చందానగర్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి డిసెంబరు చివరివారంలో ఆన్‌లైన్‌లో కాల్‌గర్ల్‌ కోసం(ఎస్కార్ట్‌ సర్వీస్‌) వెతికాడు. ఓ వెబ్‌సైట్లో కనిపించిన లింకు క్లిక్‌ చేయగానే వాట్సాప్‌ నంబరు దొరికింది. పటేల్‌ చార్మి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్‌ ద్వారా కొందరు అమ్మాయిల చిత్రాలు పంపాడు. బుకింగ్‌ కోసం రూ.510, తరువాత రూ.5,500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.7,800.. ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Latest News

More Articles