Monday, May 20, 2024

రోబోలు తయారు చేసే స్టార్టప్ లలో పెట్టుబడికి రెడీ

spot_img

దేశంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. టెక్నాలజీతో పరిష్కార మార్గం వెతకాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ విభిన్న ట్వీట్లతో ఆయన నెటిజన్లను పలకరిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఓ నదిలో తనకు తానుగా చెత్తను శుభ్రం చేస్తున్న రోబో వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేశారు. ఇలాంటి రోబోల అవసరం మన దేశానికి చాలా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: అయ్యో ఎంత కష్టం.. పెన్షన్స్ కోసం వృద్ధుల ఆందోళన

వీడియోలో కనిపిస్తున్న రోబో చైనాలో తయారైనట్లుందని చెబుతూ.. ఇలాంటి రోబోల అవసరం మన దేశానికి ఎంతగానో ఉందని తెలిపారు. ఈ తరహా రోబోలను మనం కూడా ఇప్పటికిప్పుడే తయారు చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఇలాంటి రోబోలను తయారు చేస్తున్న.. తయారు చేసేందుకు కృషి చేస్తున్న స్టార్టప్ లకు తాను అండగా ఉంటానని చెప్పారు. పూర్తి వివరాలతో తనను సంప్రదిస్తే అవసరమైన పెట్టుబడి పెట్టేందుకు తాను సిద్ధమని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Latest News

More Articles