Sunday, May 19, 2024

పార్టీ పేరును ప్రకటించిన హీరో విజయ్.. అసెంబ్లీ బరిలోకి దిగుతాం

spot_img

ప్రస్తుతం తమిళనాడులో హీరో విజయ్ సంచలనమవుతున్నాడు. రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన.. ఏకంగా కొత్త పార్టీని ప్రకటించాడు. తమిళగ వెట్రి కళిగం (TVK) పేరతో తన పార్టీని అనౌన్స్ చేశాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యమని ఆయన అన్నారు. రాజకీయ మార్పు కోసం తమిళనాడు తహతహలాడుతోందన్నారు. తమిళనాడులో అవినీతి రాజకీయ సంస్కృతి ఒకవైపు.. విభజన రాజకీయ సంస్కృతి మరోవైపు ఉన్నాయని ఆయన అన్నారు. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యతకు, ప్రగతికి అవరోధాలని విజయ్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లోకసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

Read also: జార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం.. బల నిరూపణకు 10 రోజుల గడువిచ్చిన గవర్నర్

Latest News

More Articles