Sunday, May 19, 2024

టీచర్‌ పోస్టుల భర్తీపై ‘అంధజ్యోతి’ అసత్య కథనం..!!

spot_img

హైదరాబాద్‌: టీచర్‌ పోస్టుల భర్తీపై అబద్ధాల ‘అంధజ్యోతి’ అసత్య కథనంతో మరోమారు రెచ్చిపోయింది. అబద్ధాలతో ‘మెగా డీఎస్సీ పోయి.. మినీ డీఎస్సీ వచ్చె!’ అంటూ తప్పడు వార్తను ప్రచురించి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

నిజానికి ప్రభుత్వం ఇప్పటికే గురుకులాలు, పాఠశాల విద్య కలుపుకొని 20,687 టీచర్‌ పోస్టులను భర్తీ చేసింది. తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 18,762 టీచర్‌ పోస్టుల భర్తీ చేస్తున్నది. గురుకులాల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు  డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలోనే రానుంది. మొత్తంగా 39,449 టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

Read Also.. రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం..!!

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, మాడల్‌ స్కూళ్లు, కేజీబీవీలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. యూడైస్‌ 2020-21 నివేదిక ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక స్కూళ్లల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35, ఉన్నత పాఠశాలల్లో 1:40 చొప్పున ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ప్రాథమిక పాఠశాల్లో ఈ నిష్పత్తి 1:20, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:16, ఉన్నత పాఠశాలల్లో 1:26గా ఉంది.

టీచర్లు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచినందున రిటైర్మెంట్లు తగ్గాయి. ఇక గెజిటెడ్‌ హెచ్‌ఎం, పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో 70శాతం పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీచేయాలి. ఇవి ఖాళీలుగా కనిపించినా.. రిక్రూట్ మెంట్ పరిధిలోకి రావు.

Read Aslo.. తెలంగాణ వాసుల విడుదల కోసం దుబాయ్ లో కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు

దీంతోపాటు డిగ్రీ కళాశాలల్లో 491 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 24 లైబ్రేరియన్‌, 54 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల చొప్పున మొత్తంగా 569 పోస్టుల భర్తీ ప్రక్రియ టీఎస్‌పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నది. జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్‌ లెక్చరర్‌, 40 లైబ్రేరియన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల చొప్పున 1,523 పోస్టుల భర్తీ ప్రక్రియ సైతం టీఎస్‌పీఎస్సీ ద్వారా జరుగుతున్నది. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌ పోస్టులు, 31 లైబ్రేరియన్‌ పోస్టులు, 37 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల చొప్పున మొత్తంగా 315 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.  ఇవే కాకుండా సాంకేతిక విద్యలో 520, కళాశాల విద్యలో 280, ఇంటర్మీడియట్‌ విద్యలో 3,096 కాంట్రాక్ట్‌ అధ్యాపకుల చొప్పున మొత్తం 3,896 అధ్యాపకులను క్రమబద్ధీకరించారు.

గతంలో పోస్టుల భర్తీ

  • గురుకులాల్లో 2017లో భర్తీ చేసిన పోస్టులు 11,715
  • టీఆర్టీ ద్వారా భర్తీ చేసినవి 8,972
  • తాజాగా గురుకులాల్లో భర్తీ చేస్తున్నవి 12,150
  • డీఎస్సీ ద్వారా భర్తీ చేసేవి 6,612
  • మొత్తం 39,449

టీచర్ల ఖాళీలు.. నియామకాలు

  • మొత్తం టీచర్లు 1,22,386
  • ప్రస్తుతం పనిచేస్తున్నది 1,03,343
  • మొత్తం ఖాళీలు 19,043

తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేసే పోస్టులు

  • స్కూల్‌ అసిస్టెంట్లు 1,739
  • సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 2,575
  • భాషాపండితులు 611
  • పీఈటీలు 164
  • మొత్తం 5,089

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు

  • ప్రాథమిక పాఠశాలల్లో 796
  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో 727
  • మొత్తం 1,523

పదోన్నతులు కల్పించేవి

  • గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందే స్కూల్‌ అసిస్టెంటులు 1,947
  • పీఎస్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందేవారు 2,162
  • స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందే ఎస్జీటీలు 5,870
  • మొత్తం 9,979

Latest News

More Articles