Sunday, May 19, 2024

పాకిస్తాన్ లో మళ్లీ ఉగ్రదాడి.. నలుగురు పోలీసులు మృతి

spot_img

పాకిస్తాన్‌ లో మరోసారి బాంబు పేలుళ్లు, కాల్పులు జరిగాయి. ఇవాళ(గురువారం) ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందగా..మరో ఆరుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. టెర్రరిస్టులు అక్కడినుంచి పారిపోయారు. వారి కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా.. నేటి ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ  జరిగిన పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ ఛాంబర్‌ మార్పు.. కాంగ్రెస్‌ కక్ష సాధింపు చర్య

Latest News

More Articles