Sunday, May 19, 2024

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్

spot_img

న్యూఢిల్లీ: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో అన్వర్ ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తాజామాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ సమావేశమయ్యారు. చిన్న ప్రావిన్స్‌కు చెందిన బలూచిస్థాన్ అవామీ పార్టీ (బీఏపీ) చట్టసభ్యుడు కాకర్‌ను తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేశారు. కాకర్‌ ఎన్నికను పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించారు.

రాబోయే 90 రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అన్వర్ ఉల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తారు.

Latest News

More Articles