Sunday, May 19, 2024

దారుణం..రూ. 1500కోసం దళిత మహిళను వివస్త్రను చేసి..ముఖంపై మూత్రం పోసి.!!

spot_img

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో జరిగిన దళితునిపై మూత్ర విసర్జన ఘటన దేశం మరిచిపోకముందే… ఇప్పుడు పాట్నాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టి, ఆపై ఆమెపై మూత్ర విసర్జన చేశారు. దీంతో తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాట్నా జిల్లా ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రౌడీలు దళిత మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాధిత దళిత మహిళ భర్త ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ప్రమోద్‌సింగ్ వద్ద వడ్డీకి రూ.1500 అప్పుగా తీసుకున్నట్లు చెబుతున్నారు. రుణం చెల్లించనందుకు ఆ దళిత మహిళను ప్రమోద్ సింగ్ తీవ్రంగా కొట్టి వివస్త్రను చేశారు. ఆ తర్వాత ఆ మహిళపై మూత్రం పోశారు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మహిళ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ భర్త రూ.1500 అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వాలని నిందితులు పలుమార్లు ఒత్తిడి చేశారు. ఘటన జరిగిన రోజు కూడా డబ్బులు అడిగేందుకు వచ్చారని… తన వద్ద లేవని చెప్పడంతో తీవ్రంగా కొట్టినట్లు బాధితురాలు తెలిపింది. ప్రమోద్ కుమారుడు తనపై మూత్ర విసర్జన చేశాడని బాధితురాలు ఆరోపించింది. దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టినట్లు తెలిపింది.

కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి సియారామ్ యాదవ్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు, అతని కుమారుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. తనను వివస్త్రను చేసి కొట్టిన తర్వాత, ఫిర్యాదు చేస్తే లేదా పోలీసులకు వెళితే, తదుపరిసారి గ్రామం మొత్తం నగ్నంగా ఊరేగిస్తానని నిందితులు తనను బెదిరించారని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది.

మరిన్ని వార్తలు చదవండి:

Latest News

More Articles