Saturday, May 18, 2024

బీజింగ్ లో వేల‌ల్లో క‌రోనా కేసులు.. స్ట్రెచ‌ర్ల‌పైనే చికిత్స‌

spot_img

చైనా బీజింగ్ లో క‌రోనా కేసులు భారీ వ్యాపిస్తున్నాయి. వేల‌ల్లో కొత్తగా క‌రోనా కేసులు వ‌స్తున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ ఉండ‌టం లేదు. కరోనా పాజిటివ్ రోగుల్లో ఆక్సిజన్ అవసరమైన వారికి స్ట్రెచర్లపైనే చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. బీజింగ్ లోని చుయాంగ్లియు ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ స్ట్రెచర్లపై ఆక్సిజన్ అమర్చిన కరోనా రోగులు దర్శనమిస్తున్నారు. కొందరిని వీల్ చెయిర్లలో కూర్చోబెట్టి చికిత్స చేస్తున్నారు.

మరోవైపు.. శ్మశానాలు కూడా వరుసగా వస్తున్న మృతదేహాలతో రద్దీగా మారాయి. కాగా, చైనా తీరు పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర అసంతృప్తితో ఉంది. తాజాగా కరోనా ఉద్ధృతిపై చైనా చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా లేవని స్పష్టం చేసింది. చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్నాళ్లూ జీరో కొవిడ్ పాలసీకి కట్టుబడి కఠిన లాక్ డౌన్ విధించిన చైనా.. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ప్రబలింది.

Latest News

More Articles