Friday, May 17, 2024

బెంగుళూరులో నీటి ఎద్దడి..ఆసుపత్రిపాలైన 47మంది బాలికలు..!

spot_img

కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటుండగా, 47 మంది బాలికలు డయేరియా, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎంసీఆర్‌ఐ)లో చేరిన వారిలో ఇద్దరు బాలికలకు కలరా సోకినట్లు నిర్ధారించారు. ఇద్దరు బాలికల శాంపిల్స్‌లో కలరా పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన డాక్టర్ పద్మ ఎంఆర్ తెలిపారు. ఈ ఘటన అనంతరం వైద్య విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఆస్పత్రి, హాస్టల్‌ను పరిశీలించారు.

బిఎమ్‌సిఆర్‌ఐ డైరెక్టర్ రమేష్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఇన్‌స్టిట్యూట్ మహిళా హాస్టల్‌కు చెందిన 47 మంది విద్యార్థులు శుక్రవారం విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. వీరంతా డయేరియా, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. బిఎమ్‌సిఆర్‌ఐ హాస్టల్‌లోని 47 మంది విద్యార్థినులు డయేరియా,బలహీనతతో ఫిర్యాదు చేయడంతో విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. రోగులందరి మలం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపామని.. నివేదిక ప్రకారం ఇద్దరు బాలికలు కలరాతో బాధపడుతున్నట్లు తేలిందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరు కలరా కేసులు నమోదయ్యాయని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం వెల్లడించింది. భారీ ఎండలకు తోడు నీటి కొరత ఉండటంతో కలరా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు ఖైరతాబాద్‌ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం.!

Latest News

More Articles