Friday, May 3, 2024

యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ.!

spot_img

ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు నాయకులు చేసే పనులు వింతగా అనిపిస్తుంటాయి. వీధుల్ని శుభ్రం చేయడం..చిన్న పిల్లలకు ముడ్డి కడగడం, వారికి స్నానాలు చేయించడం, వ్రుద్ధుల దగ్గర కూర్చుని చర్చించడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. అయితే బెంగాల్లోని ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ తాజాగా చేసిన ఓ పని వివాదాస్పదంగా మారింది.

శ్రిహిపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆ ఎంపీ..ఓ యువతి చెంపపై ముద్దు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే వివాదం ముదిరిపోవడంతో ఈ వీడియోను ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించారు.దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ ఎంపీ చేసిన ఈ చర్యపై రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. ఈ సంఘటన వీడియోను పంచుకుంటూ, మీరు చూసిన వాటిని మీరు నమ్మకపోతే, మేము స్పష్టం చేస్తున్నాము అని పార్టీ ట్విటర్ లో రాసింది. బీజేపీ ఎంపీ, మాల్డా నార్త్ అభ్యర్థి ఖగెన్ ముర్ము, తన ప్రచారంలో తన ఇష్టానుసారం ఒక మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకుంటున్నాడు. మహిళా మల్లయోధులను లైంగికంగా వేధించిన ఎంపీల నుంచి బెంగాలీ మహిళలపై అసభ్యకరమైన పాటలు వేసిన రాజకీయ నాయకుల వరకు, బీజేపీ శిబిరంలో మహిళా వ్యతిరేక నేతలకు కొదవలేదు. అదేవిధంగా మహిళలను గౌరవించడంలో మోదీ కుటుంబం నిమగ్నమై ఉంది.అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఊహించుకోండి అంటూ పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత,దీనిపై స్పందించిన సదరు ఎంపీ..ఆ యువతిని తన కుమార్తెగా భావించి అలా ముద్దు పెట్టానంటూ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: భారత్‌కు వస్తున్న ఎలోన్ మస్క్..!

Latest News

More Articles