Wednesday, May 22, 2024

ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రలోభాలు మొదలెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

spot_img

ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ నాయకులు ఏవేవో చేస్తుంటారు. అక్కడి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని, వారికి కావలసినవి బహుమతులుగా ఇస్తుంటారు. సేమ్ అదే పద్దతి ఫాలో అవుతున్నారు ఓ బీజేపీ ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేకపోవడంతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటర్లను ప్రలోభ పెట్టి మచ్చిక చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపే నియోజకవర్గంలోని ఓటర్లందరికీ గొడుగులు, మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేసేందుకు పథకం సిద్ధం చేశారు. మిరుదొడ్డి మండలం గోవర్ధనగిరి గ్రామంలో తన అనుచరుల చేత వాహనాల్లో వాటిని పంపి ప్రతి ఇంటికీ పంచడం ప్రారంభించారు.

Read Also: రోజూ 50 మెట్లు ఎక్కినా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చట!

ఎన్నికల్లో నేరుగా నిలబడితే గెలిచే అవకాశం లేదని గ్రహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ముందు ప్రలోభాలకు తెరలేపారు. ప్లాస్టిక్ రహిత బ్యాగులంటూ.. వాటిల్లో చీర, గొడుగులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పంపకంపై స్థానికులు ఎదురుతిగారు. అభివృద్ధి పనులు కావాలంటే.. చీరలు, గొడుగులు ఇస్తున్నారు ఏంది అని మహిళలు ప్రశ్నించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా రఘునందన్ రావుకు ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నోరు తెరిస్తే నీతులు మాట్లాడే రఘునందన్ ఇలా ప్రలోభాలకు తెరదీయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టె కార్యక్రమాలు నిర్వహిస్తున్న రఘునందన్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక నాయకులు అంటున్నారు.

Read Also: 22 ఏండ్లుగా జైలులో ఉంటూ.. విడుదల కావాల్సిన రోజే తప్పించుకున్న ఖైదీ

Latest News

More Articles