Wednesday, May 22, 2024

రోజూ 50 మెట్లు ఎక్కినా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చట!

spot_img

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లతో గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, ఈ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని గుర్తించింది అమెరికాలోని టులేన్‌ యూనివర్సిటీ. ప్రతి రోజు కేవలం 50 మెట్లు ఎక్కితే చాలు.. గుండె జబ్బుల ముప్పు 20 శాతం తగ్గుతుందని యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. యూకే బయోబ్యాంక్‌ ద్వారా 4.5 లక్షల మంది ఆరోగ్య పరిస్థితులు, అలవాట్లు, కుటుంబసభ్యుల ఆరోగ్య చరిత్ర తదితర విషయాలను సేకరించి విశ్లేషించారు. గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్న వ్యక్తులు ప్రతి రోజు మెట్లు ఎక్కడం వల్ల ఆ ముప్పు తగ్గినట్లు గుర్తించారు. అతి తక్కువ సమయంలో గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా మారాలన్నా, శరీరంలో కీలకమైన లిపిడ్స్‌ పనితీరు మెరుగవ్వాలన్నా మెట్లు ఎక్కడం మంచి మార్గమని పరిశోధకులు తెలిపారు. ఫిట్‌నెస్‌ కోసం ఎక్కువగా వ్యాయామాలు చేయలేని వారు రోజు మెట్లు ఎక్కడంతో గుండెను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

Read Also: 22 ఏండ్లుగా జైలులో ఉంటూ.. విడుదల కావాల్సిన రోజే తప్పించుకున్న ఖైదీ

Latest News

More Articles