Monday, May 6, 2024

22 ఏండ్లుగా జైలులో ఉంటూ.. విడుదల కావాల్సిన రోజే తప్పించుకున్న ఖైదీ

spot_img

కొంతమంది ఏం చేసినా కలిసిరాదు. చేతిదాకా వచ్చింది.. చేతిలోకి రాదు. నోటిదాకా వచ్చింది.. నోట్లోకి వెళ్లదు. దురదృష్టం అంతలా వెంటాడుతుంటే వాళ్లు మాత్రం ఏం చేయగలరు. ఓ వ్యక్తి విషయంలోనూ అచ్చం ఇలాంటిదే జరిగింది. రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరానికి చెందిన కమోల్జోన్ కలోనోవ్ డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం లాంటి క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. కాగా.. అతను డబుల్ మర్డర్‌లో దోషిగా తేలడంతో 2001లో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. దాంతో మార్కోవా జైలులో గత 22 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయన విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటు అతనిపై మరొక కేసు నమోదు చేశారు.

Read Also: మరో రికార్డ్‎పై కన్నేసిన రన్ మెషిన్ కోహ్లి

విడుదలకు కొన్ని గంటల ముందు ఈ ఖైదీ పరారవడంతో జైలు అధికారులు కూడా ఇతగాడి దురదృష్టం గురించి తలచుకొని తలచుకొని మరీ నవ్వుతున్నారు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్‌ను కూలీ పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు.

Read Also: రేషన్‌ డీలర్ల కమీషన్ రూ.700 నుంచి రూ.1,400లకు పెంచుతూ ఉత్తర్వులు

Latest News

More Articles