Sunday, May 12, 2024

భార్యతో కలిసి స్కూటీపై వ‌చ్చి ఓటేసిన ఎంపీ.. వీడియో వైరల్

spot_img

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. 33 జిల్లాల్లోని 199 స్థానాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఓట్లు వేస్తున్నారు.

ఇప్పటి వరకు సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు నేతలు ఓటు వేశారు. అయితే బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా తనదైన శైలిలో ఓటేశారు. సుభాష్ చంద్ర త‌న భార్య‌ రంజనా బహేరియాతో క‌లిసి టూవీల‌ర్‌పై భిల్వారాలోని పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. స్కూటీపై సాదాసీదాగా పోలింగ్ బూత్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: బలిదానాల బాధ్యత కాంగ్రెస్‎దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీనే

బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా స్కూటీపై వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు స్కూటీపై ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించారు. అతని సింప్లిసిటీని అందరూ మెచ్చుకోవడానికి ఇదే కారణం కావచ్చు. ప్రస్తుతం భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుభాష్ చంద్ర ఎంపీగా ఉన్నారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేసి మూడుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. 1996-97 లోక్‌సభ ఎన్నికల్లో భిల్వారా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి.. ఎంపీ అయ్యారు. 2003లో భిల్వారా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

Latest News

More Articles