Sunday, May 19, 2024

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

spot_img

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకురాలు తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బిజెపి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, బిఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం అన్నారు. ఇది మహిళలకే కాకుండా బిసిల పట్ల బిజెపి వ్యతిరేక వైఖరికి నిదర్శనం అన్నారు.

Also Read.. మూడు గంటల కరెంటుతో పొలాలు పారుతాయా? రేవంత్‌పై సీఎం కేసీఆర్‌ ఫైర్

బిసి ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బిజెపి పార్టీ.. తెలంగాణ ఉద్యమ కాలం నాటినుంచి సీనియర్ మహిళా నాయకురాలుగా, నాడు సిఎం కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా బిఆర్ఎస్ పార్టీ ఇంటిబిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్కకు బిజెపిలో ఇటువంటి అవమానం జరగడం బాధగా ఉందన్నారు. తుల ఉమక్కకు గతంలో ఉన్న హోదాకంటే కూడా మరింత సమున్నత హోదాను, బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుందన్నారు.

Also Read.. ప్రియమైన మోడీ కాదు.. పిరం మోడీ.. కేటీఆర్ సెటైర్లు

అనంతర ఉమ మాట్లాడుతూ.. బిజెపి పార్టీ లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదన్నారు. తనకు ఎం.ఎల్.ఏ టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి ఇచ్చారని పేర్కొన్నారు. బిజెపి లో బిసి ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక కల మాత్రమే…అందుకు ఉదాహరణ తానే, తనకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని విమర్శించారు. బిజెపి అగ్రవర్ణాల పార్టీ అని, కేవలం కింది స్థాయి కార్యకర్తలను వాడుకుని వదిలేస్తుందని మండిపడ్డారు. గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో మొదటి నుండి ఉన్నాను. అనేక హోదాల్లో పని చేసాను. ఇక్కడ ఇచ్చిన గౌరవం బిజెపి పార్టీలో ఇవ్వలేదని ఆమె తెలిపారు.

Latest News

More Articles