Sunday, May 19, 2024

రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

spot_img

హైదరాబాద్: బీఆర్ఎస్ లీగల్ టీం సోమవారం సీఈఓ వికాస్ రాజ్ ను కలిసింది. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ను కించపరిచే విధంగా ఉన్న కాంగ్రెస్ యాడ్స్ ను ఆపాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అనంతరం లీగల్ టీం హెడ్ సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకం చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

Also Read.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

క్యాడర్ ను రెచ్చగొట్టే విధంగా రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయి. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్ గానే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థలపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా? ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

Also Read.. మూడు గంటల కరెంటుతో పొలాలు పారుతాయా? రేవంత్‌పై సీఎం కేసీఆర్‌ ఫైర్

రేవంత్ కు టీడీపీ తల్లి పార్టీ అయితే, కాంగ్రెస్ అత్త పార్టీ అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య అంతర్గతంగా ఏదో ఒప్పందం కుదిరింది. స్టార్ క్యాంపెనర్ గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలి. ఎంసీసీ కమిటీకి చూపించిన ప్రకటనలకు, చానళ్లు, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాటికి పొంతన లేదు. ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్న అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు.

Latest News

More Articles