Saturday, May 18, 2024

తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్ టాప్ లు ..ఈ ఆఫర్ కేవలం ఈ మూడు రోజులు మాత్రమే..!!

spot_img

ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో ల్యాప్ టాప్ సేల్ జరుగుతుంది. ప్రతి కంపెనీ ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇంట్లో ఏదైనా పాత ల్యాప్ టాప్ ను ఉంచినట్లయితే మీరు ఎక్సేంజ్ పై రూ. 18వేల వరకు తగ్గింపు పొందుతారు. ఇంత మంచి డీల్ ను అమెజాన్ గతంలో ఎన్నడూ ప్రకటించలేదు. అమెజాన్ లో ఈ సేల్ డిసెంబర్ 23 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది. మీరు ఈ సేల్ లో ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలనుకుంటే పలు కార్డులపై రూ. 10వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు.

ఇక బ్రాండ్స్ విషయానికి వస్తే డెల్, శాంసంగ్, హానర్, హెచ్ పీ, అసూస్, లెనోవా, యాపిల్ వంటి అనేక ఇతర బ్రాండ్స్ ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. డెల్ వోస్ట్రో 14 అంగుళాల ల్యాప్ టాప్ పై 35 శాతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సాధారణ రోజుల్లో రూ. 52, 939 కి లభించే ఈ ల్యాప్ టాప్ ప్రస్తుతం రూ. 34, 190కే లభిస్తుంది. కోర్ ఐ3 సీపీయూ మోడల్, 8జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీని కలిగి ఉంటుంది. సరికొత్త విండోస్ 11తో వస్తున్న ఈ ల్యాప్ టాప్ పై రూ. 11,900 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.

అదేవిధంగా, అసూస్ వివో బుక్ 15 (2021), 4 జీబీ/256 జీబీని రూ. 22,990కి ఎక్స్చేంజ్ లేకుండా కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై కూడా 11,900 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అటు యాపిల్ ల్యాప్‌టాప్‌లపై కూడా డిస్కౌంట్ ఉంది. కానీ ఇది విండోస్ కంటే చాలా తక్కువ. మాక్ బుక్ ఎయిర్ లో లో 10 నుండి 16 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. యాపిల్ మాక్ బుక్ ఎయిర్ ఎం1 చిప్, 13.3-అంగుళాల ల్యాప్‌టాప్ ఎక్సేంజ్ లేకుండా రూ. 80,990కి అందుబాటులో ఉంది. ఇందులో 13 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. అయితే, దీనిపై రూ. 11,900 ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ధర గోల్డ్ కలర్ లో ఉంటుంది. దీని స్పేస్ గ్రే కలర్‌పై 16 శాతం డిస్కౌంట్ ఉంది. 83,990 ధరకు అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సన్‌బర్న్‌ కార్యక్రమం రద్దు

Latest News

More Articles