Saturday, May 18, 2024

రేపే కేసీఆర్ ప్రమాణస్వీకారం.. బీఆర్ఎస్ భారీ ప్లానింగ్

spot_img

బీఆర్ఎస్ చీఫ్, మాజీముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ జనాలలోకి రానున్నారు. తుంటిఎముక ఆపరేషన్ కారణంగా కంప్లీట్ రెస్ట్ లో ఉన్న కేసీఆర్ కథనరంగంలోకి రాబోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రేపే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రేపు ఉదయం 11 గంటల సమయంలో కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఇక కేసీఆర్ ప్రమాణస్వీకారానికి.. భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరు కానున్నారు.

భారీ ఎత్తున తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు చేరుకుంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది భారత రాష్ట్ర సమితి పార్టీ. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఓడిన సంగతి తెలిసిందే. మొదటి ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అటు కామరెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గాలలో కేసీఆర్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ గజ్వేల్ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచారు.

 

Latest News

More Articles