Sunday, May 19, 2024

కేంద్ర జలవనరులశాఖ మంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు

spot_img

పార్లమెంట్ ఆవరణలో కేంద్ర జలవనరులశాఖ మంత్రిని బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు తీసుకునే నిర్ణయాల వలన రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభ ప్లోర్ లీడర్ నామ నాగేశ్వరరావు మాట్లాడారు.

Read Also: కాంగ్రెస్ తీరుకు నిరసనగా జయశంకర్ యూనివర్సిటీకి తాళం వేసిన విద్యార్థులు

‘కృష్ణానది యాజమాన్య బోర్డు తీసుకునే నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి కేంద్ర మంత్రికి విన్నవించాం. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మేం చెప్పగా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్న తర్వాత ఇదేందీ అని ఆయన మమ్ములనే ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తెలంగాణ ప్రజలు నష్ట పోతారు. కృష్ణా బేసిన్‎లో ఉన్న జిల్లాల రైతన్నలు తీవ్రంగా నష్టపోతారని మేం స్పష్టం చేశాం. భవిష్యత్‎లో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రేపు పార్లమెంట్‎లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం. పార్లమెంట్‎లో కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై మేం చర్చకు లేవనెత్తుతాం’ అని కేశవరావు తెలిపారు.

Latest News

More Articles