Sunday, May 12, 2024

పల్లవి ప్రశాంత్‎పై కేసు నమోదు.. నిన్నటి నుంచి పరారీలో..

spot_img

తెలుగు రియాలిటీ షో బిగ్‎బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్‎ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఫిలింనగర్ న్యూసెన్స్ ఘటనలో పల్లవి ప్రశాంత్ ప్రధాన కారకుడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ2గా అతడి సోదరుడు పరశురాములు సహా మరి కొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పబ్లిక్ న్యూసెన్స్‎కు కారణమైన బిగ్‎బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుండటంతో జూబ్లీహిల్స్ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకుని అతడి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొల్లూరుకు చెందిన ప్రశాంత్.. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ టీమ్‎ని అక్కడకు పంపించి వెతుకుతున్నారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు.

Read Also: వారం రోజులుగా ఇంట్లో శవంతోనే జీవనం.. చివరకు పురుగులు పట్టి..

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ -7 విజేతగా ఎంపిక కాగా, అమర్ దీప్ రన్నరప్‎గా నిలిచాడు.ఈ నేథ్యంలోనే ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్‎కు చేరుకున్నారు. అమర్ దీప్‎ను విజేతగా ప్రకటించకపోవడంతో అయన అభిమానులు గొడవకు దిగారు. వారి పోటీగా ప్రశాంత్ అభిమానులు కూడా గొడవ చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్ అభిమానులు అమర్ కారుపై దాడి చేశారు. దాంతో ఇరువురి అభిమానులు పరస్పర దాడులు చేసుకున్నారు. వీరు దాడి చేసుకోవడమే కాక అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులపై కూడా రాళ్ళు రువ్వి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బయట రద్దీని చూసి పోలీసులు పల్లవి ప్రశాంత్‎ను అటుగా వెళ్ళొద్దని హెచ్చరించినా అతడు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ఓపెన్ టాప్ కార్ పై వెళ్ళాడు. ఇందువల్లే ఈ విధ్వంసం జరిగిందని పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ అప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

Latest News

More Articles