Wednesday, May 22, 2024

హెచ్‌1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం

spot_img

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్‌ నిపుణులకు శుభవార్త ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇకపై వారు హెచ్‌1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికాలోనే వాటిని రెన్యువల్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందుకు వీలుకల్పించే పైలట్‌ ప్రోగ్రామ్‌కు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌ హౌస్‌’ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నియంత్రణ సంస్థ ఓఐఆర్‌ఏ (ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ ఎఫైర్స్‌) ఈ నెల 15న ఆమోదం తెలిపింది.

Read Also: వారం రోజులుగా ఇంట్లో శవంతోనే జీవనం.. చివరకు పురుగులు పట్టి..

మూడు నెలలపాటు అందుబాటులో ఉండే ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20 వేల మంది విదేశీయులకు హెచ్‌1బీ వీసాలను రెన్యువల్‌ చేస్తారు. దీంతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతో మంది భారత టెక్‌ నిఫుణులకు లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా తప్పనిసరి. ఇప్పటివరకు ఈ వీసాలు పొందినవారు వాటిని పునరుద్ధరించుకునేందుకు స్వదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పైలట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల రెన్యువల్‌కు వీలుకల్పించడంతో విదేశీయులు తమ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Latest News

More Articles