Friday, May 17, 2024

మారిన జేఈఈ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్

spot_img

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్- 2 పరీక్షల షెడ్యూల్ మారింది. ఏప్రిల్ 1 నుంచి 15 వ‌ర‌కు జరగనున్న పరీక్షలను.. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. JEE మెయిన్ సెషన్ 2 పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యే అవకాశముంది.

ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 2. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడనేది అభ్యర్థులకు మార్చి మూడో వారంలోపు సమాచారం అందుతుంది. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

JEE మెయిన్ 2024 సెషన్ 1 కోసం దరఖాస్తు చేసి.. సెషన్ 2 పరీక్షలకూ హాజరుకావాలనుకునే వారు.. సెషన్ 1 అప్లికేషన్ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మాత్రం సెషన్- 2 JEE మెయిన్‌కు ప్రెష్ గా అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడానికి అవకాశం లేదు. ఏ అభ్యర్థి అయినా ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ నంబర్‌లను కలిగి ఉన్నట్టు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

ఇది కూడా చదవండి: భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లు

Latest News

More Articles