Thursday, May 2, 2024

కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలి

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ప్రశ్నిస్తే తొందరపడుతున్నారని విమర్శిస్తున్నారు.. మేం తొందర పడటం లేదు.. అమలు చేస్తామని మీరే తేదీలతో సహా ప్రకటించారు.. వాటిని మేము ప్రస్తావిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు గ్రూప్-1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మాట ఇచ్చి తప్పారు. ఇది చీటింగ్ కాదా అని ప్రశ్నించారు. మణుగూరులో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.

డిసెంబర్ 9 నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. జనవరి 9 పోయింది,  ఫిబ్రవరి 9 కూడా వస్తుంది. మరి ఇది చీటింగ్ కాదా? కాంగ్రెస్ పాలన అంతా మోసం..జాబ్ క్యాలెండర్ అన్నారు మోసం చేశారు.. 44 లక్షల మందికి కేసీఆర్ పెన్షన్లు ఇచ్చారు.. రూ.2 వేల ను రూ.4 వేలు చేసి  డిసెంబర్లోనే పెన్షన్ ఇస్తామన్నారు. రూ.4 వేలు కాదు కదా, పాత రూ.2 వేలు కూడా రాలేదు.. 2,500 ఇస్తామని , మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని మహిళలంతా నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Also Read.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన పార్టీ నేతలు, ప్రముఖులు

Latest News

More Articles