Friday, May 3, 2024

బీఆర్ఎస్ లో చేరిన చెరుకు సుధాకర్

spot_img

హైదరాబాద్: డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రులు.

Also Read.. ఈ నెల 26న వనపర్తిలో సీఎం కేసీఆర్‌ సభ.. మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక సూచనలు

అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తాను.. తిరిగి ఉద్యమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ గుండెచప్పుడుగా ఉండాలని తాను తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చినట్లు తెలిపారు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read.. తల్లి కోసం.. చెన్నైకి ఆమిర్ ఖాన్ షిఫ్ట్  

బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

Latest News

More Articles