Saturday, May 18, 2024

చైనాలో మరో వైరస్‎పై ప్రయోగం.. అది సోకితే 8 రోజుల్లోనే మరణం

spot_img

చైనాలో పరిశోధకులు మరో వైరస్‎పై ప్రయోగం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ వైరస్ సోకితే కేవలం 8 రోజుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని తేలినట్లు సమాచారం. దాంతో ప్రపంచమంతా మరోసారి భయాందోళనకు గురి అవుతోంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ పుట్టుకకు చైనానే కారణమంటూ అనుమానాలు కొనసాగుతున్న సమయంలో ఈ విషయం బయటకు రావడంతో ఆందోళన రేగుతోంది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌ జీఎక్స్‌_పీ2వీపై చైనాకు చెందిన పరిశోధకులు ఓ రహస్య ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డ కథనాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ వైరస్‌ సోకితే మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also: మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంపై హైకోర్టులో పిల్..

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కరోనాకు కారణమైన సార్స్‌-కొవ్‌-2 రకానికి చెందిన జీఎక్స్‌_పీ2వీ అనే ఉపరకంపై చైనా పరిశోధకులు రహస్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో 2017లో గుర్తించిన జీఎక్స్‌కు మ్యుటేషన్‌గా ఈ వైరస్‌ను భావిస్తున్నారు. రహస్య ల్యాబ్‌లో ఈ వైరస్‌ను తొలుత కొన్ని ఎలుకలపై పరిశోధకులు ప్రయోగించినట్టు తెలుస్తున్నది. ఈ వైరస్‌ ప్రభావంతో ఎలుకల ఊపిరితిత్తులు, కండ్లు, ఎముకలు, శ్వాసనాళం, మెదడు పూర్తిగా దెబ్బతిని కేవలం ఐదురోజుల్లోనే అవి నడవలేని స్థితికి చేరినట్టు సమాచారం. అత్యంత బలహీనంగా మారిన ఆ ఎలుకలు వైరస్‌ ప్రభావానికి గురైన ఎనిమిది రోజుల్లోనే మరణించినట్టు నివేదికలు వెల్లడించాయి. ఒకవేళ ఈ వైరస్‌ మనుషులకు సోకినైట్లెతే, దాదాపుగా ఇవే లక్షణాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Latest News

More Articles