Saturday, May 18, 2024

బ్రెజిల్ – అర్జెంటీనా మ్యచ్ లో ఉద్రిక్తత.. విరిగిన లాఠీ

spot_img

వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా జరిగి బ్రెజిల్‌ – అర్జెంటీనా మ్యాచ్‌ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బ్రెజిల్‌లోని మరకనా స్టేడియం వేదికగా  జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ముఖ్యంగా అర్జెంటీనా అభిమానులపై తమ ప్రతాపాన్ని చూపారు. దీనిపై అర్జెంటినా స్టార్ ఆటగాడు మెస్సీతోపాటు ఇతర ప్లేయర్స్ బ్రెజిల్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ గీతాలు ఆలపించే క్రమంలో అభిమానుల మధ్య జరిగిన గొడవ కారణంగా మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా మొదలైంది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. 2026 వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ కోసం జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా  1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది.  అర్జెంటీనా ఆటగాడు నికోలస్‌ ఒటమెండి ఆ గోల్‌ చేశాడు.

Latest News

More Articles