Friday, May 17, 2024

రజినీకాంత్ కి అభివృద్ధి కనబడ్డది.. ప్రతిపక్ష గజినీలకు కనిపించడం లేదు

spot_img

శేరిలింగంపల్లి: గత తొమ్మిదన్నర సంవత్సరంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని,  సూపర్ స్టార్ రజనికాంత్ వచ్చి ఇక్కడి డెవలప్మెంట్ చూసి న్యూ యార్క్ లో ఉన్నానా అని అన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రజినీకాంత్ కి ఇక్కడి అభివృద్ధి కనబడ్డది.. కానీ ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా కులం పేరుతొ కుంపట్లు లేవని, మతం పేరుతో మంటలు లేవన్నారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీకి మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.

Also Read.. రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు.. వివేక్ వెంకటస్వామిపై ఈడీ కేసులు

అభివృద్ధి మా కులం.. సంక్షేమం మా మతం అనే విధంగా ముందుకు వెళుతున్నము. రాబోయే రోజుల్లో ఆసరా ఫించన్లు 5వేలు ఇవ్వబోతున్నము. సౌభాగ్యాలక్ష్మి కింద మహిళలకు మూడు వేల అందిస్తాం. మోడీ జన్ దన్ ఖాతా తెరవమని చెప్పి ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. మోడీ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200 అయిందన్నారు. మోడీ పెంచిన సిలిండర్ ధర ను తగ్గిస్తామని, తిరిగి రూ. 400 లకె సిలిండర్ అందిస్తామని తెలిపారు.

Also Read.. శ్రీధర్ బాబుపై పుట్ట మధు ఫిర్యాదు

డిసెంబర్ 3 తర్వాత తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు సన్నబియ్యం అందిస్తాం. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు బీమా అందివ్వబోతున్నము. మెట్రో 70 కిమి పూర్తి చేసుకున్నామని,  శేరిలింగంపల్లిలో 250 కిమి మేర పూర్తి చేస్తామన్నారు. 20 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టి డ్రైనేజ్ సిస్టం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని శేరిలింగంపల్లి లోనే ఉన్నాయన్న కేటీఆర్.. కాంగ్రెస్ లో ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి ఉంటారని, వాళ్లకు కుర్చీల కొట్లాట తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు. గాంధీని మరోసారి గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు.

Latest News

More Articles