Saturday, May 4, 2024

రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు.. వివేక్ వెంకటస్వామిపై ఈడీ కేసులు

spot_img

హైదరాబాద్: మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదాలపై ఈడి ప్రకటన విడుదల చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో వివేక్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు తెలిపింది.  దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవులను గుర్తించినట్లు ప్రకటించింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు.

Also Read.. శ్రీధర్ బాబుపై పుట్ట మధు ఫిర్యాదు

గడ్డం వివేక్ తన భార్య, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా ఆస్తులు కొనుగోళ్లు చేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఎలాంటి వ్యాపారం లేకపోయినా భారీగా లావాదేవీలు జరిపినట్లు పేర్కొంది. ఫెమా చట్టం కింద  వివేక్ పై కేసులు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతోటి ఇప్పటివరకు 20 లక్షల రూపాయల టాక్స్ చెల్లించినట్లు సోదాల్లో గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది.

Latest News

More Articles