Monday, May 6, 2024

తెలంగాణను నెం.1 గా చేయడమే తన ధ్యేయం.. అభివృద్ధికి మరోసారి పట్టం కట్టాలి

spot_img

పరిగి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తామని పదే పదే చెబుతున్నాడు.. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. పరిగిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ అక్కడి రైతులకు 5 గంటలు కరెంటు ఇస్తున్నారు. మనదగ్గర 24 గంటలు కరెంటు ఇస్తుంటే దారుణంగా మాట్లాడుతున్నారు. పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతులకు 3 గంటలే కరెంటు వస్తుందని హెచ్చరించారు. తాను పదవి కోసం కొట్లాడటం లేదన్న సీఎం..ప్రజల దయ వల్ల తాను రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే అలర్ట్‌

దేశంలో తెలంగాణను నెం.1 గా చేయడమే తన ధ్యేయం అన్నారు. రాష్ట్రం ముందుకు పోవాలంటే బిఆర్ఎస్ గెలవాలి అన్నారు. కాంగ్రెస్ వస్తే దళారి రాజ్యం వస్తుందని చెప్పారు. మాకంటే బాగా చేస్తామని చెప్పాలి కానీ ఉన్నవాటిని తొలగిస్తామంటే ఎలా? కాంగ్రెస్ రాజ్యంలో లంబాడీలు పంచాయతీల కోసం కొట్లాడారు. లంబాడీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందే తప్ప ఏం చేయలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలను చేసిందని గుర్తుచేసిందన్నారు. పరిగిలో మహేశ్ రెడ్డిని గెలిపిస్తే ఒక రోజంతా పరిగిలోనే ఉండి అభివృద్ధి పనులపై సమీక్షిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

Latest News

More Articles