Sunday, May 12, 2024

ఆ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే అలర్ట్‌

spot_img

న్యూఢిల్లీ: గూగుల్ పే యూజర్లకు గూగుల్‌ కీలక సూచన చేసింది. గూగుల్‌ పే ద్వారా లావాదేవీలు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌ లను ఉపయోగించవద్దని సూచించింది. ఈ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు యూజర్ల మొబైల్‌లోని గూగుల్ పే యాప్‌ నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నట్లు గుర్తించి ఈ సూచన చేసినట్లు పేర్కొంది.

స్క్రీన్‌ షేరింగ్ యాప్ లను సాధారణంగా రిమోట్‌ వర్కింగ్‌ కోసం లేదా ఫోన్‌, కంప్యూటర్లలో ఏదైనా సమస్య ఉంటే మరో చోటు నుంచి దాన్ని సరిచేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఎనీ డెస్క్‌, టీమ్‌ వ్యూయర్‌ వంటివి ఎక్కువగా ఇందుకోసం వినియోగిస్తుంటారు. ఇటీవలి కాలంలో సైబర్‌ నేరగాళ్లు వీటి సాయంతో యూజర్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా నేరాలపై తరచుగా ఫిర్యాదులు వస్తుండటంతో స్క్రీన్‌ షేరింగ్ యాప్‌లు వాడొద్దని గూగుల్ పే యూజర్లకు సూచించింది.

Latest News

More Articles