Sunday, May 5, 2024

నేను కోరుకున్న బంగారు తెలంగాణ అదే.. అదే ఆకాంక్షతో పనిచేస్తున్నం

spot_img

పరిగి: చెట్టుకొకరు గుట్టకొకరు అయిన రైతాంగం మొఖాలు ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నయ్‌. ఇంకో పది పదిహేనేళ్లు రైతుబంధు, కరెంటు ఇస్తే ఎక్కడివాళ్లు అక్కడ మంచిగైతరు. నేను కోరుకున్న బంగారు తెలంగాణ ఇదే. బంగారు తెలంగాణ అంటే ఎక్కడో ఆకాశంలో ఉండదు. రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకున్న రోజే బంగారం తెలంగాణ. నేను కలగనేది అదేనని సీఎం కేసీఆర్ అన్నారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. మహేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read.. కాంగ్రెస్ వస్తే కరెంట్ కాట కలుస్తది.. ధరణి పోయి దళారుల రాజ్యం వస్తది.. సీఎం కేసీఆర్

తెలంగాణ తీసుకువచ్చాం. ఈ రాష్ట్రం నుంచి పేదరికం పారద్రోలేదాకా పని చేయాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్నాం. నేను అల్రెడీ నేను ముఖ్యమంత్రి అయ్యాను. మీ దయతో ఒకటికాదు రెండుసార్లు అయ్యాను. ఇంకా నాకేదో పదవి అనేది కాదు ఇక్కడ ముచ్చట. అన్నింట్లో తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నెంబర్‌ వన్‌గా నిలువాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నం. ఆ కమిట్‌మెంట్‌తో కొట్లాడుతున్నాం. 2014లో తెలంగాణ వచ్చిన నాడు తలసరి ఆదాయం లక్షలోపు ఉండే. ఇవాళ 3.18లక్షలతో ఇండియాలోనే నెంబర్‌వన్‌గా ఉన్నది తెలంగాణ. తలసరి విద్యుత్‌ వినియోగంలో 2014లో 1100 యూనిట్లు ఉండేది. ఇవాళ 2200యూనిట్లకు పెరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Also Read.. ఆ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే అలర్ట్‌

కేసీఆర్‌ కన్నా దొడ్డుగున్నోళ్లు.. ఎత్తుగున్నోళ్లు ఎంత మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌ రాజ్యంలో.. కనీసం మంచినీళ్లైనా ఇచ్చారా? ఎన్ని బాధలు పడ్డాం. గ్రామాల్లో బోర్లు కాలిపోతుంటే.. మోటర్లు కాలుతుంటే సర్పంచులు, ప్రజలు బాధపడ్డ బాధలు అప్పుడే మరిచిపోయామా? రబ్బర్‌ బిందెలు పట్టుకొని ఎక్కడెక్కడికో తెచ్చుకున్నాం. బోరింగ్‌లు కొట్టి కొట్టి అలసిపోవుడు.. ఆ బాధలు లేవు ఇప్పుడు. ప్రతి ఇంట్లో నల్లాబెట్టి ప్రతి లంబాడి తండాలో నల్లా పెట్టి బ్రహ్మాండంగా నల్లా నీళ్లు ఇచ్చుకుంటున్నామని సీఎం అన్నారు.

Latest News

More Articles