Wednesday, May 8, 2024

కాంగ్రెస్ వస్తే కరెంట్ కాట కలుస్తది.. ధరణి పోయి దళారుల రాజ్యం వస్తది

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ ఎంపీ గా పోటీ చేశాను.. తనను పెద్ద మెజారిటీతో గెలిపించారు. మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ సాధించిన కీర్తి ఎప్పటికి ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. 24 గంగల ఉచిత విద్యుత్, రైతుబంధు, ధరణి ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాయ్స్ కాలేజ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్ పాల్గొని మాట్లాడారు.

Also Read.. కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు ఖాయం.. మంత్రి గంగుల

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50ఏళ్లు పాలించింది. కానీ ఏం చేసింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రాకు కలిపారన్నారు. రైతు బంధు పుట్టించిందే కేసిఆర్, బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. రైతు బంధుతో కేసిఆర్ డబ్బులు దుబారా చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అంటున్నారు. ధరణి తీసేసి… భూమాత పెడుతరట. అది భూమాతా నా… భూ మేత నా…? ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు.

Also Read.. వాళ్లను నమ్మితే.. అభివృద్ధి మళ్ళీ వెనక్కి పోతుంది.. మంత్రి హరీష్ రావు

మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. మినీ ట్యాంక్ బండ్, అర్బన్ పార్క్, ఐటీ టవర్, అమర రాజా ఇండస్ట్రీ, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కాట కలుస్తది. ధరణి పోయి దళారుల రాజ్యం వస్తది. రైతుబంధుకు రాంరాం చెబుతారని హెచ్చరించారు. 5 ఏండ్లలో శ్రీనివాస్ గౌడ్ బాగా పనిచేసిండు. ఎట్లున్న హహబూబ్ నగర్ ను ఎలా మార్చిండు. పార్కులు, చెరువులు అభివృద్ధి చేసిండని ప్రశంసలు కురిపించారు. 30 కోట్ల సీఎంఆర్ఎఫ్ తెచ్చి పంచిండు. ఐటీ టవర్ తెప్పించిండు. అమరాజా బ్యాటరీ కంపెనీని తీసుకొచ్చిండని తెలిపారు. ఇంత పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ను మరోసారి ఓటువేసి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని సీఎం కోరారు.

Latest News

More Articles