Tuesday, May 7, 2024

వాళ్లను నమ్మితే.. అభివృద్ధి మళ్ళీ వెనక్కి పోతుంది

spot_img

మెదక్ జిల్లా: దుబ్బాక నియోజకవర్గ బిఅర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నార్సింగ్ మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే అది చేస్తా ఇది చేస్తా అన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్. కానీ మర్చిపోయాడు. పుస్తె మెట్టలు, డిగ్రీ కాలేజ్, రోడ్లు, దవాఖాన ఇలా ఎన్నో చెప్పాడు. ఏది నిజం ఏది అబద్దం అనేది ఆలోచించాలి. భూములు గుంజుకునే అలవాటు వాళ్ళకి ఉందని విమర్శించారు.

Also Read.. నూకలు తినమన్న పార్టీకి నూకలు చెల్లేలా చేయాలి

అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వబోతున్నం. ఇప్పటికే మూడేళ్లు దుబ్బాక వెనుకకు పోయింది. ఈసారి అభివృద్ధికి ఓటు వేద్దాం. కొత్త ఏడాదిలో అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తాము.  రైతు బంధు రైతు బీమా, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి ఇలా ఎన్నో పనులు కేసీఆర్ చేశారు. బిజెపి వాడు మోటర్ కి మీటర్ అంటే, కాంగ్రెస్ వాడు మూడు గంటల కరెంట్ అంటున్నాడు. నమ్మితే మోసపోతాం, గోస పడతాం. కేసీఆర్ రాకముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాం. కాల్వల గోదావరి నీళ్ళు తెచ్చి రెండు పంటలకు నీళ్ళు ఇస్తాం. నాడు కరెంట్ కష్టాలు చూశాం. మళ్ళీ అలాంటి బాధలు మనకు వద్దు అని సూచించారు.

Also Read.. కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు ఖాయం

రుణమాఫీ బారాణ మందం అయ్యింది. చారణ మందం మిగిలింది. 14 వేల కోట్లు ఇచ్చాం, మిగిలిన 4 వేల కోట్లు చేస్తాం. రుణమాఫీ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ తో పాటు, ఇంటడుగు జాగ ఉన్నవాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం. మీ కోరిక మేరకు మన ప్రభుత్వం రాగానే ప్రభుత్వ కాలేజీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. బిజెపి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అని మోసం చేసింది. 18 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు.  తెలంగాణలో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలినవి భర్తీ చేస్తామన్నారు.

Also Read.. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం

రఘునందన్ నమ్మి మళ్ళీ మోసపోవద్దు. మళ్ళీ అభివృద్ధి వెనక్కి పోతుంది. ప్రభాకర్ అన్నను చంపాలని చూశారు. కత్తి పోటు వల్ల ప్రాణం మీదకు వచ్చింది. 17 ఇంచులు చీరి ఆపరేషన్ చేశారు. మీ ఆశీస్సులతో తిరిగి వచ్చాడు. ఒక్కసారి ప్రభాకర్ కు అవకాశం ఇవ్వండి. మీ అభివృద్ధి తాము చూసుకుంటామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Latest News

More Articles