Friday, May 17, 2024

గతంలో నిరాశపరిచిన ములుగును అభివృద్ధి చేసిన.. ఈసారి నాగజ్యోతిని ఆశీర్వదించాలి

spot_img

మహబూబాబాద్ జిల్లా : గతంలో ముగుగు ప్రజలు తనను నిరాశపరిచినా అభివృద్ధి బాటలో తీసుకుపోయినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈసారి మాత్రం తనను గెలిపించకపోతే పంచాయతీ పెట్టుకుంటానని పేర్కొన్నారు. బడే నాగజ్యోతిని ఆదరించాలని కోరారు. నాగజ్యోతిని గెలిపిస్తే.. రెండు రోజులపాటు ములుగులోనే ఉండి సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read.. డ‌బ్బుతో వెళుతున్న కారులో మంట‌లు… అందిన‌కాడికి దోచుకున్న జ‌నం

50 ఏండ్ల పాలనలో ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. పొడు భూములకు పట్టాలు ఇచ్చామని, అలాగే వారి కి రైతుబంధు, రైతుబీమా సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ వస్తే సాగుకు 3 గంటల కరెంటు ఇస్తామని చెబుతున్నారు. అలాగే భూముల సమస్యలను పోగొట్టిన ధరణిని తీసివేస్తామని, రైతుబంధు కూడా దుబారా అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, నీళ్ల కష్టాలు వస్తాయన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులను దాటిందన్నారు. అనేక రంగాల్లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, ఉచిత కరెంట్ ఉండాలన్న, రైతుబంధు, ధరణి ఉండాలన్న బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని ఓటు వేసి గెలిపించాలని సీఎం కోరారు. ములుగు అభివృద్ధి తనది బాధ్యతన్నారు.

Latest News

More Articles