Friday, May 3, 2024

కాంగ్రెస్‌ మాటలపై గ్రామాల్లో బాగా చర్చించాలె. లేకపోతే మోసం జరుగుతది

spot_img

దుబ్బాక: తెలంగాణలో ఇన్ని రకాలుగా మేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే.. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూడలేదా..? అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇయ్యాల కాంగ్రెస్‌ పార్టీ మళ్లా ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటే ఎవరి కొంప ముంచడానికి..? ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే ఎన్‌టీ రామారావు వచ్చినంక రూ.2కే కిలో బియ్యం పథకం ఎందుకు తెచ్చినట్టు అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు. మరె ఈ మూడు గంటలు, ఐదు గంటలు కరెంటు ఇస్తే వ్యవసాయం ఎట్ల సాగాలె. రైతులు మళ్ల రాత్రిపూట కరెంటు కోసం బావుల కాడికిపోయి సావాల్నా..? ఇంకో మాట ఏమంటున్నరు..? ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తరట. భూమాత పోర్టల్‌ తెస్తరట. అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి మేం ధరణి పోర్టల్‌ తీసుకొస్తే.. మళ్ల భూమేత కోసం వాళ్లు భూమాత పోర్టల్‌ తెస్తరట. రాహుల్ గాంధీ వచ్చి ఇదే విషయాన్ని చెబుతుండు. ఆయనకు సాగు తెలుసో లేదో నాకు తెలియదు. ఇయ్యన్నీ మీరు బాగా గమనించాలె. కాంగ్రెస్‌ మాటలపై గ్రామాల్లో బాగా చర్చించాలె. లేకపోతే మోసం జరుగుతది. 24 గంటల కరెంట్, రైతుబంధు, ధరణి ఉండాలంటే ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాని సీఎం కోరారు. దళారీల రాజ్యం మళ్లీ తెచ్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. 10 ఏండ్ల నుంచి తాను చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిందన్నారు. 10 ఏండ్లుగా ప్రభాకర్ రెడ్డి చీమకు కూడా హాని చేయలేదు. ప్రజా సంక్షేమానికి పాటుపడ్డడు. కత్తిపోటుకు గురైనా దేవుడి దయవల్ల బతికి బయటపడ్డాడు.

ఇక్కడి ఎమ్మెల్యే నోటికొచ్చిన హామీలు ఇచ్చిండు. ఆయనకు ఓటు వేస్తే మోరీలో పడేసినట్టే. మోడీకి 100 ఉత్తరాలు రాస్తే.. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయా స్కూల్ ఇయ్యలే. ఇరోజు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మళ్లీ అబద్ధాలు చెబుతుండు. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తుండు. అవన్నీ అబద్ధాలు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. ఆర్డీఓ ఆఫీసుతోపాటు కాలేజీలను, రింగు రోడ్డును 100 రోజుల్లో మంజూరు చేస్తామని ప్రకటించారు.

Latest News

More Articles