Monday, May 6, 2024

జనవరి నెలలో కొత్త రేషన్‌ కార్డులు

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి నెలలో కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే 3 గంటలే కరెంట్‌ వస్తుంది. ఆ పార్టీకి ఓటేస్తే మనకు మరణమే. కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?.అప్పట్లో రూ.200 పింఛన్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్‌ మాటలు నమ్ముతామా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెసోళ్లు ఓట్లు అడుగుతున్నరు

2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ ప్రస్తుతం రూ.1200 అయ్యింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73వేల కోట్లను బీఆర్ఎస్ జమ చేసిందన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ పోరాటంతో మనకు తెలంగాణ సాకారమైంది. ఆయన దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించింది. ఈసారి కూడా నవంబర్‌ 29న దీక్షాదివస్‌ నిర్వహిస్తాం. బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడ దీక్షాదివస్‌ నిర్వహించాలి. సేవా కార్యక్రమాలు చేపట్టాలి. అస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తన పాత పార్టీ  బీజేపీ పై ప్రేమ ఉందనిన్నారు. అందుకే గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

ఇది కూడా చదవండి: వారంటి లేని కాంగ్రెస్‌ గ్యారెంటీలు ప్రజలకు ఎందుకు

 

Latest News

More Articles